Saturday, November 23, 2024

పల్లె, పట్టణ ప్రగతిపై కేసీఆర్ సమీక్ష

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పల్లె, పట్టణప్రగతి పనుల పురోగతిపై అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు, మంత్రులతో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఆదివారం ప్రగతిభవన్ లో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి లక్ష్యాలు, సాధించిన విజయాలు, ఇంకా చేయాల్సిన పనులు, పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థలకు విడుదల చేస్తున్న నిధుల ఖర్చు, హరితహారం, శ్మశానవాటికలు, పల్లెప్రకృతి వనాలు, ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్ల నిర్మాణం తదితర అంశాలపై సమీక్షిస్తున్నారు.

ఈ నెల 19 తర్వాత ఆకస్మికంగా తనిఖీచేస్తానని సీఎం ప్రకటించిన విషయం తెలిసిందే. ఎక్కడైనా పనులు జరగకుంటే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు. స్థానికసంస్థల అదనపు కలెక్టర్ల పనితీరుపై సీఎం కేసీఆర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంకా బాగా పనిచేయాల్సి ఉన్నదని, పల్లెప్రగతి, పట్టణప్రగతిలో పనులు పెండింగ్‌లో ఉన్నాయని, ఐఏఎస్‌ అధికారులు, పంచాయతీరాజ్‌ కమిషనర్లు, సీడీఎంఏ కూడా జిల్లాల్లో పర్యటించి పనుల తీరును పరిశీలించాలని సూచించారు. వీటన్నింటిపై సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశం చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement