Thursday, November 21, 2024

తెలంగాణలో లాక్ డౌన్ లేదు: సీఎం కేసీఆర్ క్లారిటీ

తెలంగాణలో లాక్‌డౌన్ విధించబోమని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో కరోనా కేసులను నిరోధించడానికి లాక్‌డౌన్ పరిష్కారం కాదని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న సీఎం కేసీఆర్.. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితిపై ప్రగతి భవన్ లో అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. కరోనా కట్టడి పై దాదాపు నాలుగు గంటలపాటు అధికారులతో చర్చించారు. లాక్‌డౌన్ వల్ల ఆర్థికవ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉందని సీఎం అన్నారు. ఇతర రాష్ట్రాల్లో లాక్‌ డౌన్ పెట్టినా కేసులు తగ్గడం లేదని, అంతేకాకుండా దానివల్ల జనజీవనం స్థంభించిపోతుందని కేసీఆర్ చెప్పారు.

మరోవైపు రాష్ట్రానికి అవసరమైన ఆక్సిజన్ మందుల కొరత పై ప్రధాని మోడీతో సీఎం కేసీఆర్ మాట్లాడారు. ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్కు అధిక సంఖ్యలో కరోనా బాధితులు రావడంతో కేసుల తాకిడి ఎక్కువైంది అని వివరించారు. తెలంగాణకు వ్యాక్సిన్లు అధిక సంఖ్యలో కేటాయించాలని ప్రధానిని సీఎం కేసీఆర్ కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement