Friday, November 22, 2024

భూముల సమగ్ర సర్వేపై సీఎం కేసీఆర్ సమీక్ష

భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపించడమే ద్యేయంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే ప్రాధమిక కసరత్తు చేసిన సీఎం కేసిఆర్ భూములన్నింటిని సమగ్ర సర్వే చేయించాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని భూములను ప్రతి ఇంచూ కొలుస్తామని చెప్పారు. డిజిటల్‌‌ సర్వే చేయించి అక్షాంశాలు, రేఖాంశాలతో కూడిన సరిహద్దులతో పాస్‌‌ బుక్‌‌లు ఇస్తామని సీఎం ఇది వరకే ప్రకటించారు. ఇదే క్రమంలో పనులు వేగవంతం చేసేందుకు కసరత్తు మొదలు పెట్టారు. ఇందుకోసం ఇప్పటికే రాష్ట్ర బడ్జెట్లో 400 కోట్ల రూపాయలను కూడ కేటాయించారు. ఇప్పటికే గ్రామాల సరిహద్దులు గుర్తించారు. ఇక పూర్తిస్థాయిలో భూముల సర్వేను చేపట్టేందుకు ప్రభుత్వ ప్రైవేటు సంస్థల సహాకారం తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే భూముల సర్వేపై ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. సంబంధిత శాఖల ఉన్నతాధికారులు, సర్వే కంపెనీల ప్రతినిధులతో సీఎం సమావేశమయ్యారు.

రాష్ర్ట వ్యాప్తంగా భూముల సర్వేకు ప్రభుత్వం సిద్ధమైన నేపథ్యంలో 17 సర్వే కంపెనీల ప్రతినిధులతో నిన్న సీఎస్ సోమేశ్ కుమార్ సమావేశమై చర్చించారు. భూ సర్వేలో భాగంగా ఇప్పటికే గ్రామాల సరిహద్దులు, రెవెన్యు సరిహద్దులను రూపోందించారు. ఆయా సంస్థలు ముందుకు వచ్చిన నేపథ్యంలో రెండు లేదా మూడు సంవత్సరాల్లో రాష్ట్రంలోని వివిధ భూముల డిజిటల్ సర్వే పూర్తికానున్నట్టు అంచనావేస్తున్నారు. మరోవైపు భూ రికార్డుల ప్రక్షాళన ద్వారా 95 శాతానికిపైగా భూముల రికార్డులను సరిచేశారు. వాటన్నింటినీ డిజిటలైజ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement