Saturday, November 23, 2024

తెలంగాణలో హీటెక్కిన రాజకీయం.. ఈటలపై వేటుకు రంగం సిద్ధం..

తెలంగాణలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ అంశం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈటల బీజేపీలో చేరనున్న తరుణంలో తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఈటల ఢిల్లీ వెళ్ల కాషాయ పార్టీ పెద్దలను కలవడం సర్వత్ర హాట్ టాపిక్ గా మారింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో ఈటల తాజా రాజకీయాలపై, పార్టీలో చేరికపై చర్చించారు. బీజేపీలో తనకు ఇచ్చే ప్రాధాన్యతపై ఆపార్టీ పెద్దల నుంచి స్పష్టమైన హామీ ఇవ్వడంతో ఇక అధికారింకగా కాషాయ కండువ కప్పుకోవడమే మిగిలింది. ఈ పరిణామాల నేపథ్యంలో టీఆర్ఎస్.. ఈటలపై వేటు వేసేందుకు రంగం సిద్ధం చేసింది.

ఈటల ఢిల్లీ ఢిల్లీ టూర్ పై సీఎం కేసీఆర్ ఆరా తీశారు. ఇప్పటికే మంత్రివర్గం నుంచి ఈటలను బర్తరఫ్‌ చేసిన కేసీఆర్.. ఇక పార్టీ నుంచి కూడా బహిష్కరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈటలపై పార్టీ పరంగా వేటు వేసేందుకు రంగం సిద్ధం చేశారు. రెండు రోజుల్లో పార్టీ నుంచి ఈటెల ను తొలగించే అవకాశం ఉంది.  ఎమ్మెల్యే పదవి పై కూడా స్పీకర్ కు ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. అయితే ఈటల రాజీనామా ప్రకటించాక వేటేస్తారా ? అంతకుముందే పార్టీ నుంచి వెళ్లగొడతారా అన్నదానిపై చర్చ జరుగుతోంది. ఈటల రాజేందర్ ను పార్టీ నుండి సస్పెండ్ చేయాలని ఇప్పటికే కరీంనగర్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నేతలు తీర్మానం చేశారు. ఈ తీర్మానం కాపీని టీఆర్ఎస్ అధిష్టానానికి పంపారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తూ  ఈటల రాజేందర్ వ్యవహరించారని టీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. మంత్రివర్గం నుండి తప్పించిన తర్వాత  ఈటల రాజేందర్ మాట్లాడిన మాటలను కూడ ఈ సందర్భంగా నేతలు ప్రస్తావించారు.  దీంతో ఈటెల రాజేందర్ మీద వేటుకు రంగం సిద్ధమైనట్లు అర్థమవుతోంది. ఈటల రాజేందర్ పార్టీకి, ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు సమర్పించలేదు. టీఆర్ఎస్ బీ ఫామ్ పై గెలిచిన ఈటలకు ఎమ్మెల్యే పదవిలో కొనసాగే హక్కు లేదంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.

సౌమ్యుడిగా, పార్టీ పట్ల విధేయత, విశ్వాసం ఉన్న వ్యక్తిగా ఈటలకు పేరు ఉన్నప్పటికీ భూకబ్జాల అంశం ఏకంగా మంత్రి పదవి కోల్పోవడం రాజకీయాలను వేడెక్కించాయి. ఈటల రాజేందర్‌పై అధికార టీఆర్‌ఎస్‌ నుంచి ముప్పేట దాడి మొదలైంది. స్థానికంగా హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ఈటల వర్గీయులందరినీ టీఆర్‌ఎస్‌ తనవైపు లాక్కుంది.జిల్లాకు చెందిన మంత్రి గంగుల కమలాకర్‌ ‘ఆపరేషన్‌ హుజూరాబాద్‌’ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించి ప్రజాప్రతినిధులు ఈటల వైపు వెళ్లకుండా అడ్డుకున్నారు. 20 ఏళ్లుగా తనతో కలిసి ఉద్యమంలో ఉన్న ఈటలను కేసీఆర్ దూరం చేయడం సంచలన నిర్ణయం అనే చెప్పాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement