Saturday, November 23, 2024

మంత్రి గంగులని.. ఫోన్ లో పరామర్శించిన సీఎం కేసీఆర్

బిసి సంక్షేమం .. ఆహార పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ తండ్రి గంగుల మల్లయ్య (87) మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. మంత్రి గంగుల కమలాకర్ తండ్రి బుధవారం కరీంనగర్ లో వారి నివాసంలో మృతి చెందారు. మరణవార్త తెలుసుకున్న సిఎం కేసీఆర్ .. మంత్రి గంగుల కు ఫోన్ చేసి పరామర్శించి.. విచారం వ్యక్తం చేశారు. తండ్రిని కోల్పోయిన బాధలో వున్న గంగులను సీఎం ఓదార్చి, వారికి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. భగవంతుడు గంగుల మల్లయ్యగారి ఆత్మకు శాంతిని చేకూర్చాలని కేసీఆర్ ప్రార్థించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement