తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో జిల్లాల కలెక్టర్లతో విస్తృతస్థాయి సమావేశం ప్రారంభమైంది. సమావేశంలో అందుబాటులో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీఎస్ సోమేశ్ కుమార్‌తో పాటు ఆయా శాఖల అధికారులు హాజరయ్యారు. ప్రత్యామ్నాయ పంటలపై రైతుల్లో అవగాహన కల్పించడం, యాసంగి పంటల సాగు, జిల్లాల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై దిశానిర్దేశం చేయనున్నారు. కార్యాచరణ ఖరారు చేసి కలెక్టర్లకు మార్గనిర్దేశం చేస్తారు. పల్లెప్రగతి, పట్టణప్రగతి, హరితహారం, మెడికల్ కాలేజీలు, ఫుడ్ ప్రాసెసింగ్ సెజ్‌లు, ధరణి సమస్యల వంటి అంశాలు చర్చకు రానున్నాయి. అలాగే దళితబంధుతో పాటు వ్యవసాయం, ధాన్యం సేకరణ, ప్రభుత్వ పథకాల అమలు, కోవిడ్ పరిస్థితి, వ్యాక్సినేషన్, పోడు భూముల సమస్యపై విస్తృతంగా చర్చించనున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital