ప్రభన్యూస్..ఉమ్మడి మెదక్ బ్యూరో : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు నేటితో ముగియనున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా నేడు అమరుల స్మారక దినోత్సవాన్ని బిఆర్ ఎస్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు.. ముఖ్య నేతలు ఘనంగా జరుపుతున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా నేడు సీఎం కేసీఆర్ జు సంగారెడ్డి జిల్లాలో పర్యటించారు. సంగారెడ్డి జిల్లా కొల్లూరులో నిర్మించిన డబుల్ బెడ్‌రూం ఇళ్లను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా సీఎం కేసీఆర్..మంత్రి కేటీఆర్ రాకని పురష్కరించుకుని ఘనంగా ఏర్పాట్లు చేశారు బిఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్ .ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ని కలిసి ఆయన ఆశీర్వాదాలు తీసుకున్నారు నీలం మధు ముదిరాజ్..అనంతరం మంత్రి కేటీఆర్ ఆశీస్సులని అందుకున్నారు. కాగా నీలం మధు ముదిరాజ్ చేస్తున్న సేవా కార్యక్రమాలను తెలుసుకున్న సీఎం కేసీఆర్.. మంత్రి కేటీఆర్ ఆయనని అభినందించారు.ఇదే విధంగా పార్టీ గౌరవాన్ని పెంచాలని వారు సూచించారు. సాక్షాత్త్ సీఎం కేసీఆరే అభినందించడం తన అదృష్టమని సంతోషాన్ని వ్యక్తం చేశారు నీలం మధు ముదిరాజ్. తన ప్రాణం ఉన్నంత వరకు పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు నీలం మధు ముదిరాజ్.
Advertisement
తాజా వార్తలు
Advertisement