Thursday, November 21, 2024

Breaking | సీఎం కేసీఆర్‌కు స్వ‌ల్ప అస్వ‌స్థ‌త‌.. వైర‌ల్ ఫీవ‌ర్‌తో బాధ‌ప‌డుతున్నారు: కేటీఆర్‌

సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. వారం రోజులుగా వైరల్‌ ఫీవర్‌, దగ్గుతో బాధపడుతున్నారని ఆయ‌న కుమారుడు, మంత్రి కేటీ రామారావు మంగళవారం సోషల్‌ మీడియా ద్వారా తెలిపారు. సీఎం కేసీఆర్‌కు ఇంటి వద్దనే డాక్ట‌ర్లు చికిత్స అందిస్తున్నారని, ఆయన ఆరోగ్యాన్ని వైద్యుల బృందం నిశితంగా పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. కొద్దిరోజుల్లోనే ఆయన కోలుకొని సాధారణ స్థితికి చేరుకుంటారని వైద్యులు చెప్పారని కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement