హైదరాబాద్, ఆంధ్రప్రభ: సీఎం కేసీఆర్ ఇవ్వాల జగిత్యాల జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఈ పర్యటనలో భాగంగా జగిత్యాలలో నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్ భవన సముదాయంతోపాటు, టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాన్ని సీఎం ప్రారభించనున్నారు. ఆ తర్వాత పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన తర్వాత భారీ బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. జిల్లా అధికారులతో సమీక్షా నిర్వహిస్తారు.
ఇక.. మధ్యాహ్నం 12 గంటలకు సిద్దిపేట జిల్లాలోని ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రం నుండి హెలికాప్టర్ ద్వారా జగిత్యాల జిల్లాకు చేరుకోనున్నారు. మధ్యాహ్నం 12.30కు జగిత్యాల జిల్లా సమీకృత అధికారుల కార్యాలయంలోని హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. 12.40 గంటలకు టీఆర్‌ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారు. ఒంటి గంటకు జగిత్యాల జిల్లా కేంద్రంలో నూతన మెడికల్ కళాశాలకు శంకుస్థాపన చేయనున్నారు. 1.15 నిమిషాలకు సమీకృత జిల్లా అధికారుల కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు.
అనంతరం జిల్లా అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశంలో పాల్గొన్న తర్వాత మధ్యాహ్న భోజనం చేయనున్నారు. 3.10కి జగిత్యాల జిల్లా కేంద్రాన్ని ఆనుకొని ఉన్న మోతె గ్రామంలో ఏర్పాటు చేసిన భారీ బ#హరంగ సభకు హాజరుకానున్నారు. సాయంత్రం బహిరంగ సభ ముగిసిన వెంటనే 4.15కు జగిత్యాల నుండి తిరిగి ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రానికి తిరిగి వెళ్లనున్నారు.