దేశ..రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పారు సీఎం కేసీఆర్. శాంతి, కరుణ, సహనం, ప్రేమ విలువలను ప్రపంచానికి చాటిన ఏసుక్రీస్తు బోధనలు విశ్వమానవ సహోదరత్వానికి దోహదం చేశాయని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఒకవైపు శాస్త్ర, సాంకేతిక రంగాలు గొప్పగా పురోగమిస్తున్నా.. మరోవైపు మానవీయ విలువలు మృగ్యమైపోతున్న నేటికాలంలో క్రీస్తు బోధనలు ఆచరణీయమని అన్నారు. శత్రువునైనా క్షమించే గొప్ప గుణం, సాటి మనుషుల పట్ల ప్రేమ, కరుణ, సహనం అనే సద్గుణాల ఆచరణ అనివార్యమైనదని పేర్కొన్నారు. ఏసుక్రీస్తు దీవెనలు ప్రజలందరికీ లభించాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement