ప్రతిపక్ష కాంగ్రెస్ పై సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం శాసనసభలో పల్లె, పట్టణ ప్రగతిపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఉపాధి హామీ నిధులను దారి మళ్లిస్తున్నారని అన్నారు. దీనిపై స్పందించిన సీఎం కేసీఆర్.. భట్టి విక్రమార్క సభను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. అది వారి అవగాహన లోపమైనా ఉండాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో పంచాయతీరాజ్ అని, కేంద్రంలో రూరల్ డెవపల్‌మెంట్ అని పిలుస్తారని తెలిపారు. కేంద్రం నుంచి వచ్చే నిధులు ఉండవని స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర బడ్జెట్‌లు ఉంటాయన్న సీఎం.. ఫైనాన్స్ కమిషన్ ఉంటుందని తెలిపారు. ఈ ఫైనాన్స్ కమిషన్ అన్ని రాష్ట్రాలను సంప్రందించి, స్థానిక స్వపరిపాలన సంస్థలు కూడా పని చేయాలని ప్రతి రాష్ట్రానికి, ప్రతి సంవత్సరానికి ఇంత ఇవ్వాలని ఐదేండ్లకు ఒకసారి రెకమెండ్ చేస్తారని తెలిపారు. అవి ఫైనాన్స్ కమిషన్ కేటాయింపులు.. కేంద్ర ప్రభుత్వ కేటాయింపులు కావు అని స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: తెలంగాణలో రేషన్ కార్డుల లెక్క ఇదీ..