Friday, November 22, 2024

మల్లన్నసాగర్‌కు బయల్దేరిన సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్ మల్లన్నసాగర్ కు బ‌య‌ల్దేరారు. మ‌ల్ల‌న్న సాగ‌ర్ ప్రాజెక్టును జాతికి అంకితం చేయనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మల్లన్నసాగర్ రిజర్వాయర్ నిర్మాణం చేప‌ట్టారు. సీఎం కేసీఆర్ మల్లన్నసాగర్ రిజర్వాయర్‌లోకి నీటిని విడుదల చేయనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అతిపెద్దదిగా మల్లన్నసాగర్‌కు గుర్తింపు ఉంది. భారీ మట్టికట్టతో..50 టీఎంసీల సామర్థ్యంతో మల్లన్నసాగర్ నిర్మాణం చేపట్టారు. మల్లన్నసాగర్ నిర్మాణంలో 11 కంపెనీలు, మల్లన్నసాగర్ నిర్మాణంలో సుమారు 7 వేల మంది కార్మికులు పనిచేశారు. మల్లన్నసాగర్ ద్వారా 15.70 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. హైదరాబాద్‌కు తాగునీటి కోసం 30 టీఎంసీలు సరఫరా చేసే అవకాశముంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement