కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ఇవ్వాల పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ఆయనకు శుభాకాంక్షలు తెలియచేశారు. రాజకీయాల్లో, విద్యా సంస్థల పరంగా కూడా మల్లారెడ్డి అంటే అందరికీ చాలా క్రేజ్ ఉంటుంది. ఆయన ఎప్పుడు ఏం మాట్లాడుతారా.. ఏ సంచలనం విషయం బయటపెడుతారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.
అలాంటిది మంత్రి మల్లారెడ్డి పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియాలో గ్రీటింగ్స్తో హోరెత్తించారు. ఇక.. మంత్రి మల్లారెడ్డికి సంబంధించిన కొన్ని మాటలను ఈ సందర్భంగా షేర్ చేసుకుంటూ సంబురపడుతున్నారు. అందులో చాలా ఫేమస్ డైలాగ్ అయిన.. ‘‘పాలమ్మిన, పూలమ్మినా’’ అనే మాటలను కోట్స్ చేసుకుంటూ హ్యాపీగా షేర్ చేసుకుంటున్నారు.
- Advertisement -