ఎప్పుడు జోష్‌లో ఉండే మాజీమంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి బిగ్‌షాక్ తగిలింది. ఆయన సొంత కాలేజీ కోసం మల్లారెడ్డి రోడ్డు వేసుకున్న రోడ్డును అధికారులు తొలగించారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని హెచ్ఎండీఏ లేఅవుట్లో 2500 గజాల స్థలం ఆక్రమించి ఆయన సొంత కాలేజీ కోసం మల్లారెడ్డి రోడ్డు వేసుకున్నట్లు తీవ్ర ఆరోపణలు ఉన్నాయి.
దీనిపై గతంలో మేడ్చల్ మల్కాజిగిరి ఎంపీగా ఉన్న ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి అప్పట్లో అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు హెచ్ఎండీఏ స్థలం ఆక్రమణపై మేడ్చల్ కలెక్టర్ దృష్టి పెట్టారు. హెచ్ఎండీఏ లేఅవుట్లో అక్రమంగా ఏర్పాటు చేసిన రోడ్డును తొలగించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలతో మల్లారెడ్డి కాలేజీ కోసం వేసిన రోడ్డును అధికారులు తాజాగా తొలగించారు.