Thursday, November 21, 2024

KNR| రుడాకు సీఎం గ్రీన్ సిగ్నల్.. త్వరలోనే ఉత్తర్వులు

.. రామగుండంకు మహర్దశ
.. ఎన్నికల హామీని నెరవేర్చనున్న మక్కాన్


ఎన్ టి పి సి, ఆంధ్రప్రభ : రామగుండం అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీకి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చినట్టు విశ్వసనీయ‌ వర్గాల సమాచారం. త్వరలోనే రుడా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మక్కాన్ సింగ్ ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు ప‌లుమార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి రామగుండం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేయాలని కోరారు.

సానుకూలంగా స్పందించిన సీఎం రుడా ఏర్పాటుకు అంగీకరించినట్లు తెలిసింది. అధికారికంగా రుడా ఏర్పాటు ఉత్తర్వులు వెలువడితే రామగుండంకు మహర్దశ రానుంది. ఎన్నికల హామీని నెరవేర్చబోతున్న ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ ను పారిశ్రామిక ప్రాంత ప్రజలు అభినందిస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement