Monday, September 16, 2024

TS | మంగళవారం రైతుల ఖాతాల్లో రైతుబంధు… నిధులకు క్లీయరెన్స్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రైతుబంధు నిధులు విడుదలకు సర్కార్‌ సర్వం సిద్దం చేసింది. మంగళవారం ఉదయమే రాష్ట్రంలోని రైతుల ఖాతాల్లో రైతుబంధు నిధులు జమ కానున్నాయి. ఈ మేరకు ఆర్ధిక శాఖ రూ. 7700కోట్ల విడుదలకు క్లీయరెన్స్‌ ఇచ్చింది. తాజాగా రైెతుబంధు పథకం కింద నగదు బదిలీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈనెల 28లోగా పంపిణీ పూర్తిచేయాలన్న షరతు నేపథ్యంలో సర్కార్‌ అన్ని ఏర్పాట్లూ చేస్తోంది.

ఈ పథకం కింద రైతులకు ఏడాదికి ఎకరానికి రూ.10,000 చొప్పున ప్రభుత్వం పెట్టు-బడి సాయం అందిస్తుంది. ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించిన నిధులు జమ చేసింది. కాగా యాసంగి సీజన్‌ కోసం రెండో విడత నిధులు నవంబర్‌లోనే రైతులకు అందించాల్సి ఉంది. అయితే.. ఆలోగా ఎన్నికల కోడ్‌ రావడంతో విపక్షాలు ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించాయి. ఎన్నికలను ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున నిధుల జమను ఆపేయాలని సూచించింది.

అయితే విపక్షాల అభ్యర్థనలను తోసిపుచ్చిన ఈసీ.. యాసంగి సీజన్‌ కోసం రైతుబంధు పథకం కింద పెట్టు-బడి సాయం పంపిణీకి నవంబర్‌ 24న గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించినా సెలవుల కారణంగా రైతుల ఖాతాల్లోకి ఆ నిధులు ఇంకా జమ కాలేదు. శనివారం, ఆదివారం, సోమవారాలు వరుస సెలవుదినాలు కావడంతో 28న మంగళవారం రోజున నిధులు జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి అనుగుణంగా శుక్రవారం రాత్రి భూపరిపాలన ప్రధాన కమిషనర్‌, వ్యవసాయ శాఖ కార్యాలయాలు ఈ-కుబేర్‌ పోర్టల్‌ ద్వారా రాష్ట్రంలో అర్హులైన 70 లక్షల మంది లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేశారు. ఆపై ఫైలును ఆర్థికశాఖకు పంపించారు.

నిధుల విడుదలకు వీలుగా ఆర్థికశాఖ రూ.7,700 కోట్లను -టె-జరీల నుంచి నిధులను బ్యాంకులకు ట్రాన్స్‌ఫర్‌ చేయాలి. ఆ తర్వాత రైతుల ఖాతాల్లో డబ్బులు జమవుతాయి. శని, ఆది, సోమవారాలు సెలవు దినాలు కావడంతో -టె-జరీలతో పాటు- బ్యాంకులు పనిచేయడం లేదు. మంగళవారం మళ్లీ పనిదినం కావడంతో ఆ రోజు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈనెల 28న సాయంత్రం 5 గంటలలోపే అర్హులైన రైతుల ఖాతాల్లోకి నగదు బదిలీని పూర్తి చేసేందుకు ఏర్పాట్లు- చేస్తున్నామని వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement