Monday, November 18, 2024

Navya vs Rajaiah: రాజయ్యకు క్లీన్ చిట్.. నవ్య ఆరోపణలపై ఆధారాలు లేవన్న పోలీసులు

సర్పంచ్ నవ్య ఆరోపణల వివాదంలో ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కు క్లీన్ చిట్ లభించింది. ఈ వివాదంపై విచారణ జరిపిన పోలీసులు రాజయ్య ప్రేమయం ఏమీ లేదని తేల్చిచెప్పారు. సర్పంచ్ నవ్య చేసిన ఏ ఒక్క ఆరోపణకు ఆమె నుండి ఎటువంటి ఆధారాలు అందలేదని పోలీసులు తెలిపారు.

ఎమ్మెల్యేపై చేసిన వివిధ ఆరోపణలకు సంబంధించి ఆధారాలు పంపించాలని పోలీసులు నవ్యకు నోటీసులు జారీ చేశారు. అయితే ఆమె ఒక్క నోటీసుకు కూడా జవాబు ఇవ్వడం కానీ, పోలీసుల ముందు హాజరు కావడం కానీ జరగలేదు. దీంతో పోలీసులే స్వయంగా ఆమె ఇంటికి వెళ్లి విచారించారు. ఈ విచారణలో సైతం ఎటువంటి ఆధారాలు లభించకపోవడంతో రాజయ్యకు క్లీన్ చిట్ ఇస్తూ వివాదాన్ని ముగించారు. ఈ మేరకు పోలీసులు మహిళా కమిషన్ కు ఒక నివేదికను పంపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement