హైదరాబాద్ లోని ఆమ్నేషియా పబ్ రేప్ కేసులో హోం మంత్రి మనవడు ఫుర్ఖాన్‌కు క్లీన్ చీట్ ఇచ్చారు పోలీసులు. అతనికి సంబంధం లేకున్నా ఆరోపణలు చేశారన్నారు డీసీసీ జోయల్ డేవిస్. కాగా ఈ కేసులో అయిదుగురు నిందితులను గుర్తించామని, ముగ్గురు మైనర్లు కూడా ఉన్నట్టు చెప్పారు డీసీపీ. కాగా, ఈ కేసులో ఎమ్మెల్యే కొడుకుపైనా ఇప్పటివరకైతే ఎలాంటి ఆధారాలు లేవన్నారు.
అయితే.. ఈ కేసులో ఇద్దరిని అరెస్టు చేశామని, పబ్‌కి మైనర్ అమ్మాయిని తీసుకొచ్చిన హాదితోపాటు ఖాదర్‌ఖాన్‌ని అరెస్టు చేసినట్టు చెప్పారు. ఇందులో వక్ఫ్‌బోర్డ్ చైర్మన్ కొడుకు కూడా ఉండడం విశేషం.. దీనిపై ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని, నిందితులు ఎవరైనా వదలిపెట్టమని వెల్లడించారు డీసీపీ జోయల్ డెవిస్