Saturday, November 16, 2024

WGL: ప్రజాపాలన వేదికగా కాంగ్రెస్ లో బయటపడ్డ వర్గ విభేదాలు…

డీసీసీ అధ్యక్షునిపై కార్యకర్తలకు గుస్సా…
వేదిక దిగిన డీసీసీ అధ్యక్షులు కొమ్మూరి…


జనగామ ప్రభ న్యూస్ : తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం వేదికపై కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షునిపై కార్యకర్తలు గుస్సా కావడంతో జనగామ కాంగ్రెస్ పార్టీలో ఒక్కసారిగా వర్గ విభేదాలు తలెత్తాయి. మంగళవారం తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రజాపాలన దినోత్సవానికి ముఖ్యఅతిథిగా ఆలేరు శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య పాల్గొని తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా వేదికపై జనగామ కాంగ్రెస్ డీసీసీ అధ్యక్షులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఆశీనులయ్యారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో ఇంతకాలం వర్గ పోరు బయటికి పొక్కకుండా కాపాడుకున్నా ఒక్కసారిగా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం వేదికపైకి మాజీ మార్కెట్ చైర్మన్ ఎర్రమల సుధాకర్, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ లింగాజి డీసీసీ అధ్యక్షునిపై కూర్చోవడాన్ని అభ్యంతరం తెలపడంతో ఒక్కసారిగా వర్గ విభేదాలు బయటపడ్డాయని, దీంతో స్థానిక డీసీపీ రాజమహేంద్ర నాయక్ కల్పించుకొని శాంతింపజేశారు. జనగామ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. దీంతో డీసీసీ అధ్యక్షులు వేదికపై నుండి దిగి కింద కూర్చున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement