Friday, November 22, 2024

TS : గిరిజ‌నుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌… పోలీసుల‌ను ఉరికించి కొట్టిండ్రు…

ఖమ్మం జిల్లా చంద్రాయపాలెంలో పోడుభూముల విషయంలో గిరిజన వర్గాల మధ్య ఘర్షణను దారి తీసింది. గిరిజనుల దాడిని పోలీసులు అడ్డుకునేందుకు ప్ర‌య‌త్నించగా వారిపై దాడికి దిగారు. పోలీసులపై పెద్దసంఖ్యలో గిరిజనులు దాడికి పాల్పపడ్డారు.

ఈ క్రమంలో సత్తుపల్లి సీఐ కిరణ్‌, నలుగురు సిబ్బదికి గాయాలు అయ్యాయి. బుగ్గపాడు, చంద్రాయపాలెం గిరిజనుల మధ్య పోడు భుమూల విషయంతో ఘర్షణ చోటు చేసుంది. ఈ ఘర్షణను అడ్డగించిన పోలిసులను వెంటపడి మరీ గిరిజనలు కర్రలతో కొట్టారు. ఒక్కసారిగా అక్కడి పరిస్థితి తీవ్ర ఉద్రిక్తతంగా మారింది.

- Advertisement -

వివ‌రాల‌లోకి వెళితే సత్తుపల్లి మండలం బుగ్గపాడు గ్రామ శివారు లోని చంద్రాయపాలెం గ్రామంలో పోడు భూముల వ్యవహారంలో అక్కడ ఉన్న రెండు గిరిజన వర్గాల మధ్య వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో గిరిజనుల మధ్య జరుగుతున్న ఘర్షణను ఆపేందుకు సత్తుపల్లి నుంచి పోలీసులు చేరుకున్నారు. సత్తుపల్లి సిఐ కిరణ్ ఆధ్వర్యంలో సమస్యని పరిష్కరించడం కోసం ఇరువర్గాలని సమన్వయ పరచడానికి ప్రయత్నం చేశారు. ఈ సమన్వయ పరిచే సందర్భంగా గిరిజనుల్లో ఒక వర్గం కర్రలు తీసుకొని పోలీసులపై దాడికి పాల్పడింది. అటవీ ప్రాంతంలోనే గిరిజనులు పెద్ద పెద్ద కర్రలతో సీఐతో పాటు వున్న పోలీసుల అక్కడి నుంచి ఉరికించారు. అంతేకాకుండా.. వారిపై దాడికి పాల్పడ్డారు.

దీంతో కొంతమంది పోలీసులు అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా వారి వెంటపడి గిరిజనులు తరుముకుంటూ వెళ్లారు. పెద్ద పెద్ద కర్రలతో గిరిజనులు ఒక్కసారిగా పోలీసుల మీద పడటంతో పోలీసులు పరుగులు పెట్టారు. గిరజనులకు ఎంత చెప్పినా వినకపోవడంతో ఇక పోలీసులు కూడా చేతులెత్తేసారు.. అక్కడి నుంచి పరుగులు పెడుతూ వచ్చారు. వారి మోటార్ బైక్ పై ఎక్కి వెళ్ళిపోతున్న పోలీసులు సివిల్ డ్రెస్ లో ఉన్న పోలీసులపై కూడా వెంట తరిమి వారిపై కూడా దాడి చేశారు. దీంతో ఏమీ చేయలేని పరిస్థితిలో పోలీసులు మోటార్ బైక్ నుంచి దిగి వారిని గిరిజనులని బ్రతిమిలాడు కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement