Monday, September 16, 2024

Clarify – ఆక్ర‌మ‌ణ‌లా.. అటువంటిదేం లేదే.. మాజీ మంత్రి ప‌ట్నం

ఇంత చిన్న వాటిని క‌బ్జా చేస్తానా..
బిఆర్ఎస్ వి అన్ని ఆరోప‌ణ‌లే
నాది ప‌ట్టా భూమి..వ్య‌వ‌సాయ కుటుంబం
111 జివో- ప్ర‌భుత్వ అనుమ‌తితో గెస్ట్ హౌజ్ క‌ట్టా
ఎఫ్ టీఎల్, బఫర్ జోన్ క‌ట్టిన‌ట్లు నిరూపించండం
నేనే స్వ‌యంగా కూల్చివేస్తా..
గెస్ట్ హౌజ్ నిర్మాణంపై మాజీ మంత్రి ప‌ట్నం వివ‌ర‌ణ‌

హైద‌రాబాద్ – ప్రభుత్వ నిబంధనల ప్రకారమే హమాయత్ సాగర్‌లో ఓ ఇల్లు నిర్మించుకున్నట్లు మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి తెలిపారు. తాను ఎలాంటి చెరువును ఆక్రమించలేదని తేల్చి చెప్పారు.. కొంతమంది చెరువును కబ్జా చేసి ఇల్లు నిర్మించారని అంటున్నారని, అయితే . కొంతమంది కావాలనే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. హిమాయత్ సాగర్‌లో నిర్మించిన గెస్ట్ హౌస్‌పై బీఆర్ఎస్ నాయకులు అక్రమంగా నిర్మించుకున్నారని చేస్తున్న ఆరోపణలపై ఆయన నేడు మీడియాకు వివ‌ర‌ణ ఇచ్చారు..

- Advertisement -

తాత, తండ్రుల నుంచి తమది వ్యవసాయ కుటుంబమని, తమ కుటుంబానికి చాలా వ్యవసాయ భూములు ఉన్నాయని చెప్పారు. అలాంటిది ఇంత చిన్న భూమిని కబ్జా చేయాల్సిన అవసరం తనకు లేదన్నారు. అక్కడ ఎలాంటి కాంపౌండ్ లేదని కావాలంటే మీడియా ప్రతినిధులు సహా ఎవరైనా వెళ్లి చూడొచ్చని చెప్పారు. అవసరమైతే పట్టా కాగితాలు కూడా ఇస్తానని చెప్పుకొచ్చారు. వాస్తవానికి అది చిన్న గెస్ట్ హౌస్ అని, అది ఎఫ్ టీఎల్, బఫర్ జోన్ పరిధిలో ఉందనే ఆరోపణల్లో నిజంలేదని మహేందర్ రెడ్డి చెప్పారు. అక్కడికి చుట్టుపక్కల పలు ఫంక్షన్ హాళ్లు, ఇతర నిర్మాణాలు కూడా ఉన్నాయని వివరించారు.

ఒకవేళ నిబంధనల ప్రకారం లేదని తేలితే.తానే ఆ భవనాన్ని హైడ్రా సహాయంతో కూల్చివేసేందుకు సహకరిస్తానని మహేందర్ రెడ్డి చెప్పారు. ఎప్‌టీఎల్ పరిధిలో ఉందని నిరూపిస్తే త‌న‌ గెస్ట్ గౌస్ కూల్చివేసేందుకు సిద్ధమని, అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పూర్తి వివరాలు తెలియకుండా మాట్లాడారని భావిస్తున్నట్లు చెప్పారు. 111 జీఓ పరిధిలో చాలా మంది మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇళ్లు నిర్మించుకున్నారన్నారు. ప్రభుత్వం అనుమతి ఇస్తేనే నిర్మించుకున్నామని చెప్పారు..

హైడ్రా చ‌ర్య‌లు భేష్..

హైదరాబాద్ పరిధిలో ఆక్రమణకు గురైన చెరువులు, కుంటలను పునరుద్ధరించేందుకు సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న చర్యలు బాగున్నాయంటూ పట్నం మహేందర్ రెడ్డి ఈ సందర్భంగా మెచ్చుకున్నారు. హైడ్రా ఏర్పాటును ఎమ్మెల్సీ ప్రశంసించారు. ఈ విషయంలో ప్రతీ ఒక్కరూ ప్రభుత్వానికి సహకరించాల్సిన అవసరం ఉందని పట్నం మహేందర్ రెడ్డి చెప్పారు. హైడ్రా తీసుకుంటున్న‌చ‌ర్య‌లు భేష్ గా ఉన్నాయ‌ని, తాను వాటిని సంపూర్ణంగా స‌మ‌ర్ధిస్తున్న‌ట్లు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement