హైదరాబాద్ – తాను ఎక్కడికి పారిపోలేదని, తన ఇంటిలోనే ఉన్నానని నటుడు మోహన్ బాబు ప్రకటించారు. కొన్ని మీడియాతో తాను పారిపోయినట్లు వస్తున్న వార్తలపై ఆయన నేడు క్లారిటీ ఇచ్చారు.. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు..జర్నలిస్టులపై దాడి కేసులో జరుగుతున్న పరిణామాలను వక్రీకరిస్తున్నారని, కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియాలో కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
ముందస్తు బెయిల్ కోసం తాను పెట్టుకున్న పిటిషన్ ను హైకోర్టు రిజెక్ట్ చేసిందని మీడియాలో వార్తలు వస్తున్నాయని చెబుతూ.. అవన్నీ తప్పుడు కథనాలని కొట్టిపారేశారు. కోర్టు తన బెయిల్ పిటిషన్ ను తిరస్కరించలేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం తాను తన నివాసంలోనే వైద్యుల పర్యవేక్షణలో ఉన్నానని మోహన్ బాబు తెలిపారు. నిజానిజాలు తెలుసుకుని, వాస్తవాలను మాత్రమే ప్రజలకు వెల్లడించాలని మీడియాకు మోహన్ బాబు విజ్ఞప్తి చేశారు.