సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఖండించిన హైడ్రా కమిషనర్
అవాస్తవాలతో ప్రజలలో ఆందోళనలు రేకేత్తించవద్దు
బచ్చమ్మ ఇళ్లు ఎఫ్ టి ఎల్ పరిది లేవు
అనుమానాలతో ఆమె బలవన్మరణం
మూసి ప్రక్షాళనతో హైడ్రాకు ఏ సంబంధం లేదు
తాము ఎటువంటి మార్కింగ్,సర్వే చేయడం లేదు
తేల్చి చెప్పిన హైడ్రా చీఫ్ రంగనాథ్
హైదరాబాద్: కూకట్పల్లి యాదవ బస్తీలో గుర్రాంపల్లి బుచ్చమ్మ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. గుర్రంపల్లి శివయ్య, బుచ్చమ్మ దంపతులకు ముగ్గురు కూతుర్లు ఉన్నారు. శివయ్య దంపతులు వారికి పెళ్లిళ్లు చేసి కట్నంగా తలో ఇల్లును రాసి ఇచ్చారు. అయితే జలాశయాల ఎఫ్ఎఎల్ పరిధిలో నిర్మించిన ఇళ్లను హైడ్రా కూల్చివేస్తున్న విషయం తెలిసిందే. అయితే తమ బిడ్డలకు ఇచ్చిన ఇళ్లు కూల్చివేస్తారనే మనస్తాపంతో తల్లి బుచ్చమ్మ బలవన్మరణానికి పాల్పడినట్లు వార్తలు వైరల్ గా మారాయి.. దీంతో హైడ్రా చీప్ రంగనాథ్ స్పందించి వివరణ ఇచ్చారు.
బుచ్చమ్మ ఇళ్లకు నోటీస్ లే ఇవ్వలేదు
యాదవ బస్తీలోని బుచ్చమ్మకు చెందిన మూడు ఇళ్లకు హైడ్రా ఎవరికి ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని రంగనాథ్ చెప్పారు.. బుచ్చమ్మ ఆత్మహత్యపై కూకట్పల్లి ఇన్స్పెక్టర్తో మాట్లాడానని అంటూ శివయ్య దంపతుల కూతుర్లుకు రాసిచ్చిన ఇళ్లు కూకట్పల్లి చెరువుకు సమీపంలోనే ఉన్నప్పటికీ ఎఫ్ఎల్ పరిధికి దూరంగా ఉన్నాయన్నారు. కూల్చివేతల్లో భాగంగా తమ ఇళ్లను కూలుస్తారనే భయంతో వారి కూతుర్లు బుచ్చమ్మను ప్రశ్నించారన్నారు. . దీంతో మనస్తాపానికి గురైన బుచ్చమ్మ ఆత్మహత్య చేసుకుందని . ఈ ఘటనతో హైడ్రాకు సంబంధం లేదని చెప్పారు.
మూసీ ప్రక్షాళనలో హైడ్రా జోక్యం లేదు…
వివరణ లేకుండా హైడ్రా గురించి మీడియాలో గానీ, సామాజిక మాధ్యమాల్లోగానీ వార్తలు భయాలు పుట్టించవద్దని మీడియాకు, సోషల్ మీడియా నిర్వహకులను కోరారు రంగనాథ్ . రాష్ట్రంలో జరుగుతున్న కూల్చివేతలను హైడ్రాకు ఆపాదిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.. కూల్చివేతలకు సంబంధించి మూసీ పరిధిలో చేపట్టిన ఏ సర్వేలోనూ హైడ్రా భాగం కాలేదన్నారు. మూసి నదిలో శనివారం భారీగా ఇళ్లను కూల్చివేయబోతున్నట్లు నకిలీ వార్తలు విపరీతంగా ప్రచారం అవుతున్నాయన్నారు. కొన్ని సోషల్ మీడియా ఛానళ్లు ప్రత్యేక ఎజెండాతో హైడ్రాపై అవాస్తవ, నకిలీ వార్తలను ప్రచారం చేస్తున్నాయని మండి పడ్డారు. ఈ విషయాన్ని మీడియా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. హైడ్రా కూల్చివేతల గురించి అనవసర భయాలు వద్దని అన్నారు.. పేదలు, మధ్యతరగతి ప్రజలు నివశిస్తున్న ఇళ్లను కూల్చివేతల చేపట్టబోమని చెప్పారు.