Tuesday, November 26, 2024

Clarification – అదానికి హాయ్ చెప్తే .. ఇంత డ్రామా చేస్తారా: కెటిఆర్ మంత్రి పొంగులేటి పైర్

హైదరాబాద్: తాను వ్యాపారవేత్త అదానీకి హాయ్ చెప్పాన‌ని, దానికే కెటిఆర్ డ్రామాలు చేస్తున్నార‌ని మండిప‌డ్డారు మంత్రి పొంగులేటి. నేడు హైద‌రాబాద్ తో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, ‘అదానీ తానేను హైదరాబాద్లోని ఒక హోటల్లో లిఫ్ట్ దగ్గర కలిశామ‌ని వెల్ల‌డించారు.. పాత పరిచయంతో అదానీకి హాయ్ చెపితే దానికి ఇంత డ్రామా చేస్తారా? అంటూ నిల‌దీశారు. అదానీతో పదేండ్లు అంటకాగింది బీఆర్ఎస్ పార్టీయేన‌ని కౌంట‌ర్ ఇచ్చారు.

గత పది సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం అదానీతో చాలా ఒప్పందాలు చేసుకుంద‌ని ఆరోపించారు. అదానీకి బీఆర్ఎస్ ఇచ్చిన కాంట్రాక్టులు రద్దు చేయాలా వద్దా క్లియర్గా చెప్పాల‌ని కెటిఆర్ ను ప్ర‌శ్నించారు.. మనసులో ఏదో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వంపై అదానీ మార్క్ వేస్తారా? అంటూ పొంగులేటి మండిప‌డ్డారు.. మా నాన్న తర్వాత మీ నాన్ననే (కెసిఆర్) ఎక్కువగా నమ్మాన‌ని, అయితే ఐదేళ్లు తడిబట్టతో నా గొంతు కోశారు’ అని అవేదన వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement