కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పలు హోటళ్లలో పౌరసరఫరాల శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. గురువారం పలు హోటళ్లలో తనిఖీలు నిర్వహించగా.. సబ్సిడీ బియ్యం ఉన్నట్లు గుర్తించి శాంపిళ్లను సేకరించారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న హోటళ్లపై కేసులు నమోదు చేస్తామని సివిల్ సప్లై అధికారులు స్పష్టం చేశారు.