Friday, November 22, 2024

Choutuppal : టీఎస్ ఐపాస్ లాంటి విధానం అమెరికాలో కూడా లేదు.. మంత్రి కేటీఆర్

టీఎస్ ఐపాస్ లాంటి విధానం అమెరికాలో కూడా లేద‌న్నారు మంత్రి కేటీఆర్.చౌటుప్ప‌ల్ మండ‌లం దండుమ‌ల్కాపూర్ గ్రీన్ ఇండ‌స్ట్రీయ‌ల్ పార్కులో ఏర్పాటు చేసిన తెలంగాణ పారిశ్రామిక ప్ర‌గ‌తి ఉత్స‌వంలో మంత్రి కేటీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు. రాష్ట్రంలో ప‌రిశ్ర‌మ‌ల‌కు అత్యంత పార‌ద‌ర్శ‌కంగా అనుమ‌తులు ఇస్తున్నామ‌ని మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అత్యద్భుతంగా పురోగతి సాధించింద‌ని తెలిపారు. ప‌ర్యావరణం, పరిశ్రమల రంగాల్లో అద్భుతమైన ప్రగతి జరిగింద‌న్నారు. తెలంగాణలో సమగ్ర, సమత్యులత, సమ్మిళిత అభివృద్ధి జరిగింద‌ని కేటీఆర్ పేర్కొన్నారు. పరిశ్రమల ఏర్పాటులో అత్యంత పారదర్శకంగా అనుమతులు ఇస్తున్న రాష్ట్రం మన తెలంగాణ మాత్ర‌మే అని గుర్తు చేశారు. టీఎస్ ఐపాస్ విధానంలో 15 రోజుల్లో అనుమతులు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ. అమెరికాలో కూడా ఇలాంటి విధానం లేదు అని అక్కడి పారిశ్రామిక వేత్తలు చెప్పార‌ని కేటీఆర్ గుర్తు చేశారు. మానవ చరిత్రలో మూడవ అతి పెద్ద కార్యక్రమం మన హరితహారం కార్యక్రమం అని కేటీఆర్ తెలిపారు. భ‌విష్య‌త్ త‌రాల‌కు ప‌చ్చటి వాతావ‌ర‌ణం అందిస్తున్నామ‌ని పేర్కొన్నారు. ప‌ల్లె, ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి కార్యక్ర‌మాల ద్వారా ప‌ల్లెలు, ప‌ట్ట‌ణాల‌కు ప‌లు జాతీయ అవార్డులు వ‌చ్చాయ‌న్నారు.

తెలంగాణ‌లోని మారుమూల గ్రామాల్లో ఉన్న ప్ర‌జ‌లు కూడా సంతోషంగా ఉన్నారు. తెలంగాణను అవహేళన చేసిన వాళ్ళు కనుమరుగు అయ్యార‌ని పేర్కొన్నారు. 60 ఏండ్ల‌లో జ‌ర‌గ‌ని ప‌నిని ఈ తొమ్మిదేండ్ల‌లో కేసీఆర్ చేసి చూపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఇతర దేశాలకు పాఠాలు నేర్పుతుంది అని అమెరికా ఇంజనీర్లు అన్నారు. అది తెలంగాణకు దక్కిన గొప్ప గౌరవం అని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.సూపర్ స్టార్ రజనీకాంత్ హైదరాబాద్ ని పొగిడారు…. ఆయన ఎన్నో దేశాలు తిరుగుతారు… మన హైదరాబాద్ అత్యద్భుతంగా అభివృద్ధి జరిగింది అని కితాబు ఇచ్చారు..గుజరాత్ రాష్ట్రంలో ఈ రోజుకు కూడా కరంట్ కోతలు ఉన్నాయి… పక్కా రాష్ట్రాల‌కి వెళ్లి ఎలాంటి పరిస్థితి ఉందో తెలుసుకోండి…పచ్చదనంకి మారు పేరు తెలంగాణ ..గ్రీన్ బడ్జెట్ పెట్టిన ఏకైక రాష్ట్రం తెలంగాణ…నెస్ట్ జనరేషన్ గురించి ఆలోచించే ముఖ్యమంత్రి మన కేసీఆర్.60 ఏళ్లలో జరిగిన పని ఈ తొమ్మిది ఏళ్లలో చేసి చూపారన్నారు.కాళేశ్వరం ప్రాజెక్టు ఇతర దేశాలకు పాఠాలు నేర్పుతుంది అని అమెరికా ఇంజనీర్లు అన్నారు..అది తెలంగాణ కు దక్కిన గొప్ప గౌరవం…it ఎగుమతులను పెంచాం.. ధాన్యం దిగుబడులు రికార్డ్ స్థాయిలో వస్తున్నాయి..ఇవి తెలంగాణ విజయాలు..వాస్తవాలు చెప్పుకోవాలి… అన్ని రంగాల్లో తెలంగాణ అఖండ విజయాలను సాధించింది… దండుమల్కాపూర్ పార్క్ లో ఏర్పాటు చేసిన స్కిల్ బిల్డింగ్ సెంటర్ లో వేల మంది యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తామ‌న్నార‌న్నారు మంత్రి కేటీఆర్.తెలంగాణ లో మారు మూల గ్రామాల్లో ఉన్న ప్రజలు కూడా ఇవ్వాళ సంతోషంగా ఉన్నరు……తెలంగాణ ను అవహేళన చేసిన వాళ్ళు కనుమరుగు అయ్యారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement