Friday, November 22, 2024

Choppadandi – పెరిగిన ఆదాయాన్ని గ్రామీణ, పట్టణాల అభివృద్ధికి ఖర్చు చేస్తాం – గంగుల

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ రాబడి అనూహ్యంగా పెరిగిందని… రాష్ట్ర ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ అన్నారు. నగరంలోని సీతారాంపూర్ లో నిర్వహించిన చొప్పదండి ముఖ్య కార్యకర్తల సమావేశానికి మంత్రి గంగుల కమలాకర్ తో కలిసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్బంగా పలువురు చొప్పదండి బీఆర్ఎస్ నేతలు వినోద్ కుమార్, గంగుల కమలాకర్, సుంకె రవిశంకర్ లను శాలువాలతో సత్కరించి… జ్ఞాపిక అందజేశారు.

తెలంగాణాలో రాబడి 75వేల కోట్లు దాటిందని చెప్పారు. గోదావరి నదిపై ఆరు ప్రాజెక్టులు కాళేశ్వరం, సుందిల్ల, అన్నారం, మేడిగడ్డ, తుపాకులగూడెం, తుక్కుగూడెం ప్రాజెక్టులను పూర్తి చేశామని గుర్తుచేశారు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాబడిని కేవలం గ్రామీణ, పట్టణాల నిమిత్తం వినియోగించనున్నామని స్పష్టం చేశారు ‌

గంగుల మాట్లాడుతు… లీప్ ఫార్వర్డ్ విధానంలో దూసుకుపోనుందని చెప్పారు. పక్కనే గోదావరి ఉన్నా.. నీళ్లు నిలుపుకోలేకపోయామని.. అన్నారు. చొప్పదండి ఇంచార్జ్ గా బాధ్యతలు అప్పగించిన సీఎం కేసీఆర్ కు ధన్యవాదములు తెలిపారు.

ఈ కార్యక్రమంలో , మేయర్ సునీల్ రావు, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, నగర బీఆర్ఎస్ అధ్యక్షుడు చల్ల హరిశంకర్, చొప్పదండి నేతలు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement