Monday, January 6, 2025

ADB | చింతగూడ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సస్పెన్షన్

జన్నారం, జనవరి 4 (ఆంధ్రప్రభ): మంచిర్యాల జిల్లా కవ్వాల పులుల అభయారణ్యంలోని జన్నారం రేంజ్ చింతగూడ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ మధుకర్ ను కాలేశ్వరం జోన్ సీసీఎఫ్ ప్రభాకర్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించారనే అభియోగం మేరకు మధుకర్ ను సస్పెండ్ చేసినట్లు తాళ్లపేట రేంజర్, జన్నారం ఇన్చార్జి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వి.సుష్మారావు శనివారం తెలిపారు.

జన్నారం ఫారెస్ట్ రేంజులోని పైడిపల్లి అటవీ బీటులో ఈమధ్య కాలంలో కలప అక్రమ రవాణ ఎక్కువగా జరిగిందని, కలప స్మగ్లర్లతో మిలాకత్ అయ్యాడని, విధుల్లో నిర్లక్ష్యం వహించారనే పలు ఆరోపణ నేపథ్యంలో చింతగూడ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, పైడిపల్లి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ను సస్పెండ్ చేసినట్లు తెలిసింది. ఐదు రోజుల క్రితం పైడిపల్లి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ తన్వీర్ పాషా సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలో అదే ఫారెస్ట్ బీటు పరిధిలోని చింతగూడ సెక్షన్ ఆఫీసర్ మధుకర్ ను సస్పెండ్ చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement