ఖమ్మం క్రైం, ప్రభన్యూస్: ఖమ్మం నగరం కేంద్రంగా ఇద్దరు వ్యక్తులు పసిపిల్లల విక్రయానికి పాల్పడుతుండటంతో నిఘా పెట్టి, చాకచాక్యంగా పట్టుకొని కేసు నమోదు చేయించినట్లు ఏహెచ్ టియు సిఐ నవీన్, కో ఆర్డినేటర్ కె.శ్రీనివాస్ తెలిపారు. ఆరు నెలల క్రితం గుర్తుతెలియని వ్యక్తుల ద్వారా 1098కి ఇద్దరు వ్యక్తులు చిన్నపిల్లల్ని, అప్పుడే పుట్టిన పసిపిల్లల్ని సేకరించి అమ్ముతున్నట్లు సమాచారం వచ్చింది. సదరు సమాచారాన్ని వెంటనే కో-ఆర్డినేటర్ శ్రీనివాస్ స్ధానిక మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం(ఏహెచ్‌టియు) ఇంచార్జ్ సిఐ నవీన్‌కి, సిడిపిఓ కవితకి తెలియచేశారు. విషయాన్ని రుజువు పరచుకోవడం కోసం నిఘా పెట్టి టీంమెంబర్ అనూష, ఏహె చ్టియు టీం నరసింహారావు, భాస్కర్లు నిరంతరం వెంబడించారు. ఖమ్మం నగరంలోని వినోద థియేటర్ ప్రాంతంలో పే అండ్ యూజ్ మరుగుదొడ్లు నిర్వహిస్తున్న ఒక మహిళ ఆమె అనుచరులు ఆ ముసుగులో ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నారు. 3 నెలల తర్వాత వీరుచేసే అక్రమాలు నిజమేనని తేలాయి. వీరిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవడానికి టీం పథక రచన చేశారు. చైల్డ్‌లైన్ టీం మెంబర్‌ను పిల్లలు కావాల్సిన వ్యక్తిగా పరిచయం చేసుకున్నారు. పిల్లలు కావాలంటే ఉన్నారని, అందుకు రూ.4ల క్షలు అవుతుందని తెలిపారు. అందుకు ఒప్పుకొగా, సదరు వ్యక్తి ప్రతిరోజు వీలున్నపుడల్లా వాట్సాప్ ద్వారా పసిపిల్లల ఫోటోలు పంపించడం, రేటు చెప్పడం, తర్వాత పాపను ఒకరికి అమ్మినాం అని వాయిస్ రికార్డ్స్ పంపేవారు. అలా జరుగుతున్న క్రమంలో వారంరోజుల క్రితం ఒక పాప డెలవరీ అయిందని, మరో వారం రోజుల్లో డిశ్చార్జ్ అవుతుందని అమౌంట్ సిద్దం చేసుకోవాలని కోరారు. పాపను చూశాం అని టీం సభ్యులు తెలిపారు.
అందుకు సదరు వ్యక్తి ఇలా అయితే ఈ పాప కూడా మీకు దక్కదని, కావాలంటే జడ్పీసెంటర్ రండి ఆసుపత్రికి తీసు కువెళ్తున్నానని చెప్పాడు. అక్కడికి వస్తాం అని టీం బయలుదేరగా, ఫోన్‌చేసి ఆ వ్యక్తి డిశ్చార్జ్‌కి సమయం పడుతుంది, పాపది కొణిజర్ల మండలం అని జడ్పీ సెంటర్ ప్రాంత ఆసుపత్రిలో ఉందని, పాప మీకు కావాలంటే రూ.1.50 వేలు అడ్వాన్స్‌గా చెల్లించాలని, కావాలంటే బాండ్ పేపరు మీద రాసి సంతకం పెడతానని తెలిపారు. వెంటనే టీం బాండ్ పేపరు తీసుకొని వెళ్ళి, విషయం రాసి నగదు, బాండ్ మార్చుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. విచారించిన టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. పాపను అమ్ముతానన్న పాప తండ్రి కూడా ఇది నిజమేనని, తనకు రూ.50వేలు ఇస్తానన్నారని తెలిపాడు. దీంతో జేజే యాక్ట్ సెక్షన్ 80, 81, ఐపిసి 511 మరియు 109 సెక్షన్లపై కేసు నమోదు చేశారు. టీం సభ్యులు ఫోటోలు, వీడియోలు పోలీసు వారికి అందించారు.
ఎంతో ఓర్పుగా, చాక చక్యంగా శిశు విక్రయాల విషయాన్ని వెలుగు లోకి తీసుకువచ్చిన చైల్డ్‌లైన్-1098, మానవ అక్రమ రవా ణా నిరోధక విభాగంను చైల్డ్‌లైన్ డైరెక్టర్ ఎంసి ప్రసాద్, సిడబ్ల్యూసి చైర్పర్సన్ భారతరాణి, డిఎస్పీ రవి తది తరులు అభినందించారు. పిల్లలను దత్తత తీసుకోవాలి అనుకునేవారు జిల్లా సంక్షేమ అధికారిని కానీ ప్రత్యేక దత్తత వి భాగాన్ని కానీ, బాలల సంక్షేమ సమితిని కానీ 1098ని కానీ సంప్రదించాలని పిల్లల్ని కొనడం, అమ్మడం, అక్రమంగా రవాణా చేయడం నేర మని తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.