Friday, November 22, 2024

HYD: నీలోఫర్‌ ఆస్పత్రిలో ఆర్నెళ్ల చిన్నారి మిస్సింగ్

హైదరాబాద్: నీలోఫర్‌ ఆస్పత్రిలో ఆరు నెలల చిన్నారి ఫైజల్‌ఖాన్ అదృశ్యమైన ఘటన చోటుచేసుకుంది. ఎత్తుకుంటానని ఓ మహిళ కోరితే.. చిన్నారి తల్లి ఆమె చేతికి ఇచ్చింది. ఈలోగా వార్డులోపలికి వెళ్లి వచ్చేసరికి మహిళతో పాటు చిన్నారి అదృశ్యమైంది. దీంతో ఆందోళన చెందిన చిన్నారి తల్లి చుట్టుపక్కల వెతికి.. ఎంతకీ కనిపించక పోవడంతో భర్తతో కలిసి నాంపల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై నాంపల్లి పోలీసులు కేసు నమోదు చేసి సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement