చైల్డ్ ఫౌండ్ ఇండియా ఆధ్వర్యంలో సుఖవ్యాధులపై గురువారం మండలంలోని అశోక్‌నగర్ గ్రామంలో సర్పంచ్ గొర్రె కవిత-రవి అధ్యక్షతనఅవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మండల వైద్యాధికారి మల్యాల అరుణ్ కుమార్ మాట్లాడుతూ… స్త్రీ పురుషులు సుఖవ్యాధులతో ఇబ్బందులకు గురవుతున్నట్లైతే వైద్యాధికారికి సమాచారం అందించి పరిష్కారం పొందాలన్నారు.గ్రామాలలో చైల్డ్ ఫౌండ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అవగాహన సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
డి.ఆర్.పి జ్యోతి మాట్లాడుతూ…. హెచ్.ఐ .వి ,సుఖవ్యాధులని నివారించేందుకు సంస్థ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు.హెచ్.ఐ వి బాధితులు ఉచిత వైద్య సేవలకు సమీపం లోని ప్రభుత్వ వైద్యశాలలో సంప్రదించాలన్నారు.దీనితో పాటు టి.బి వ్యాధి లక్షణాలు ఉన్నట్లయితే స్థానిక ఏ.ఎన్. ఎం ను సంప్రదించాలన్నారు.
సూపర్ వైజర్ రజని మాట్లాడుతూ …నిరుపేద నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వారికి చైల్డ్ ఫండ్ ఇండియా అనేక సంవత్సరాలు గా చేయూతనందిస్తూ ముందుకి సాగుతుందన్నారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన పలువురికి టి.బి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎల్.డబ్ల్యూ.ఎస్ లింక్ వర్కర్స్ కవిత,లాబ్ టెక్నీషియన్ లింగన్న, పంచాయతి కార్యదర్శి అబేదా బేగం,ఏ.ఎన్.ఎం రమ, ఆశా కార్యకర్తలు తదితరులు ఫాల్గొన్నారు.