Tuesday, November 26, 2024

యాదాద్రిని దర్శించుకున్న సీజేఐ ఎన్వీ రమణ దంప‌తులు

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు యాదాద్రిలో ల‌క్ష్మీన‌ర‌సింహస్వామిని దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం హైదరాబాద్ నుంచి యాదాద్రి చేరుకున్న జస్టిస్ ర‌మ‌ణ‌కు తెలంగాణ‌ మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జగదీశ్ రెడ్డితో పాటు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌ యాదాద్రికి వచ్చారు. దేవాలయంలో  ఎన్‌వీ రమణ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కు చెల్లించుకున్నారు. అర్చకులు వారికి వేదాశీర్వచనం చేసి, స్వామివారి శేషవస్త్రం, చిత్రపటంతోపాటు తీర్థ ప్రసాదాలను అందజేశారు. తర్వాత ఆయ‌న ఆల‌య పున‌ర్నిర్మాణ ప‌నుల‌ను సందర్శించారు.  ప్రధాన ఆలయానికి ఉత్తర దిశలో చేపట్టిన నిర్మాణ పనులు, ప్రెసిడెన్షియల్‌ విల్లా కాంప్లెక్స్‌ పనులు, ఆలయ నగరిని జస్టిస్‌ ఎన్వీ రమణ పరిశీలించనున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పర్యటన నేపథ్యంలో ఆలయం వద్ద పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. కాగా, ఎన్వీ రమణతో పాటు తెలంగాణ సిఎం కేసీఆర్, గవర్నర్ తమిళసై పాల్గొనాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల వారిద్దరూ యాదాద్రి రాలేకపోయారు.

https://twitter.com/Ashi_IndiaToday/status/1404643273520553984
Advertisement

తాజా వార్తలు

Advertisement