హైదరాబాద్ : పీసీసీ ఉపాధ్యక్షుడు, ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు, తెలంగాణ ఉద్యమకారుడు డాక్టర్ చెరుకు సుధాకర్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి హరీశ్‌రావు కలిసి చెరుకు సుధాకర్‌కు గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
బీసీ నేతల విషయంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితోపాటు కాంగ్రెస్ నేతల తీరును నిరసిస్తూ డాక్టర్ చెరుకు సుధాకర్ ఆ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఏ పదవీ లేకపోయినా భరించవచ్చు గానీ ఆత్మగౌరవం లేని రాజకీయ ప్రయాణం నిష్ప్రయోజనం అని భావించి రాజీనామా చేస్తున్నట్టు శుక్రవారం ప్రకటించారు. అయితే ఇవాళ మంత్రుల సమక్షంలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, చిరుమర్తి లింగయ్య, గాయకుడు ఏపూరి సోమన్నతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.