Friday, November 22, 2024

Chennur – వివేక్ ది మోస చరిత్ర – బాల్క సుమన్

చెన్నూర్ ఆంధ్రప్రభ: పూటకో పార్టీ మార్చుకుంటూ అధికారం కొరకు వేంపర్లు పడుతున్న కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి ది మోసచరిత్రని బిఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ అన్నారు. మంగళవారం నియోజకవర్గం లోని తన నివాసంలో నియోజకవర్గ స్థాయి యువ సమ్మేళనం నిర్వహించారు ఈ సందర్భంగా జరుగునున్న ఎన్నికల్లో యువకులు పాత్రపై దిశ నిర్దేశం చేశారు.

కాంగ్రెస్ గుండా రాజకీయాలను రెచ్చ గొట్టే వాఖ్యలపై ఒపిగా వ్యహరించాలని , వివేక్ వెంకటస్వామి పాలనలో చేసిన అభివృద్ధి ఏంటో ప్రజలు చూసారని కొత్త పరిశ్రమలు స్థా పించకుండ ఉన్న పరిశ్రమలను రాకుండా చేసిన ఘనత వారికే దక్కిందన్నారు. ఈ నెల 27న జరుగనున్న కేటీఆర్ పర్యటనను విజయవంతం చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఎంపి వెంకటేష్ నేత నియోజకవర్గ యువకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement