Friday, November 22, 2024

Chennur – విచ్చ‌ల‌విడిగా డ‌బ్బు పంపిణి… వివేక్ పై బాల్క సుమ‌న్ ఈసికి ఫిర్యాదు

హైదరాబాద్ : చెన్నూరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేస్తున్నారని సీఈఓ వికాస్ రాజ్ కు ఫిర్యాదు చేసినట్లు చెన్నూరు బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ తెలిపారు. వివేక్ కంపెనీ నుంచి ఒక సూట్ కేసు కంపెనీకి సోమవారం ఎనిమిది కోట్లు బదిలీ చేశారని, సూట్ కేసు కంపెనీలో ఇద్దరు డైరెక్టర్లు వివేక్ కంపెనీ ఉద్యోగులు ఉన్నారని వివరించారు. ఆ కంపెనీ రామగుండంలో వివేక్ ఇంటి చిరునామా పైనే ఉందన్నారు.

ఈ ఖాతాను ఫ్రీజ్ చేయాలని కోరినట్లు మీడియాతో తెలిపారు. త్వరలోనే ఈడీ, ఆదాయ పన్ను శాఖలకు కూడా ఫిర్యాదు చేస్తామన్నారు. వివేక్, కుటుంబ సభ్యులు, కంపెనీలు, బంధువుల బ్యాంకు ఖాతాల పై నిఘా పెట్టాలని కోరాన‌ని తెలిపారు. వివేక్ కంపెనీల నుంచి స్థానిక వ్యాపారులకు డబ్బులు పంపుతున్నార‌ని, వివేక్ పాపంలో పాలు పంచుకోవద్దని స్థానిక వ్యాపారులను కోరారు.. డబ్బు అహంకారంతో వివేక్ నేతలను హరాజ్ పాటలో కొనుగోలు చేస్తున్నార‌ని ఆరోపించారు. అంగీలు మార్చినంత ఈజీగా పార్టీలు మార్చే వ్యక్తులకు ప్రజలు తగిన బుద్ది చెప్పాలని ప్రజలను కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement