పౌరసత్వంపై వేములవాడ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ కు హైకోర్టులో చుక్కెదురైంది. కోర్టును తప్పుదోవ పట్టించినందుకు హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టుకు పేక్ డాక్యుమెంట్స్ సమర్పించారని మండిపడింది. చెన్నమనేని రమేశ్ జర్మనీ పౌరుడేనని హైకోర్టు తేల్చి చెప్పింది.
రమేష్ కు రూ.30లక్షల జరిమానా విధించింది హైకోర్టు. పిటీషనర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు రూ.25 లక్షలు చెల్లించాలని, మిగిలిన రూ.5లక్షలు లీగల్ సర్వీ సెస్ అథారిటీకి చెల్లించాలని, నెల రోజుల్లో చెల్లింపులు చేయాలని ఆదేశించింది.
- Advertisement -