Sunday, November 17, 2024

Rescued – ఆ చెంచులు సురక్షితం!

రెస్క్యూ చేసి కాపాడిన పోలీసులు
వేట‌కు వెళ్లి.. అక్క‌డే చిక్కుకుపోయారు
డిండి వాగుకు పోటెత్తిన వ‌ర‌ద నీరు
స‌మాచారం అందుకున్న న‌ల్గొండ ఎస్పీ
డ్రోన్ సాయంతో బాధితులున్న‌ ప్ర‌దేశం గుర్తింపు
రంగంలోకి దిగిన పోలీసు రెస్క్యూ టీమ్
ప‌ది మందిని సుర‌క్షితంగా కాపాడిన పోలీసులు
అభినందించిన తెలంగాణ‌ డీజీపీ జితేంద‌ర్‌

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, హైద‌రాబాద్‌:

డిండి వాగులో చిక్కుకున్న చెంచులు సురక్షితంగా బయటపడ్డారు. వాగులో చిక్కుకున్న పది మందిని పోలీసు రెస్క్యూ బృందాలు రక్షించాయి. గోనబోయినపల్లికి చెందిన చెంచులు ఆగ‌స్టు 31వ తేదీన చేపల వేటకు వెళ్లారు. ఈ క్రమంలో అచ్చంపేట మండలం సిద్ధాపూర్‌ వద్ద డిండి వాగులో వారు చిక్కుకుపోయారు. తాము వాగులో చిక్కుకుపోయినట్లు గ్రామస్తుల‌కు సోమవారం సమాచారం అందించారు. దీంతో నల్లగొండ ఎస్పీ శరత్‌చంద్ర పవార్ అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. ఎస్పీ ఆదేశాలతో రంగంలోకి దిగిన జిల్లా పోలీసులు.. డ్రోన్‌ కెమెరాల సహాయంతో వారున్న ప్రదేశాన్ని గుర్తించారు.

- Advertisement -

ఎస్పీ చొర‌వ‌.. సేఫ్‌గా బ‌య‌ట‌ప‌డ్డ చెంచులు

వ‌ర‌ద నీటిలో చిక్కుకుపోయిన బాధితులకు తొలుత ఆహార పదార్థాలను అందించారు. అయితే.. వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో రెస్క్యూ ఆపరేషన్‌ను నిలిపివేశారు. మంగళవారం ఉదయం నాగర్‌కర్నూల్‌ పోలీసుల సహాయంతో వారిని క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. సహాయక చర్యల్లో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, గజ ఈతగాళ్లు పాల్గొన్నారు. కాగా, చెంచులను రక్షించిన పోలీసులను డీజీపీ జితేందర్‌ అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement