శంషాబాద్, మే 3 (ప్రభ న్యూస్) శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ లో 5రోజుల క్రితం శంషాబాద్ విమానాశ్రయంలోలోకి వచ్చిన చిరుత ఎట్టకేలకు రాత్రి బోనులో చిక్కిందని అటవీ సంరక్షణ ప్రధానాధికారి ఆర్ఎం డోబ్రియల్ తెలిపారు. 5రోజుల క్రితం గొల్లపల్లి మీదుగా ఎయిర్పోర్ట్ లోపలికి వచ్చిందని తెలిపారు. అలారం మోగడంతో విమానాశ్రయ సిబ్బంది సీసీ కెమెరాల్లో చూసి చిరుత ఫెన్సింగ్ దూకినట్లు గుర్తించిందన్నారు.
ఎయిర్ పోర్ట్ సిబ్బంది అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో తాము చిరుతను బంధించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని ప్రత్యేకంగా 5 బోన్ లు 25ట్రాప్ కెమెరాలు పెట్టీ ఎప్పటికప్పుడు అధికారులతో మానిటరింగ్ చేశామన్నారు.
కాసేపట్లో ఎయిర్పోర్ట్ నుంచి చిరుత ను నెహ్రూ జూ పార్క్ తరలించి అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించి ఒకరోజు పాటు పర్యవేక్షణ లో ఉంచుతామని తెలిపారు. తర్వాత అడవిలో విడిచి పెడతామనిపేర్కొన్నారు. ఐదురోజులుగా చిరుతను బంధించడం కోసం శ్రమించిన రంగారెడ్డి జిల్లా DFO సుధాకర్ రెడ్డి, FDO విజయనంద్ లను ప్రత్యేకంగా అభినందించారు.