నిర్మల్ రూరల్ (ప్రభా న్యూస్): నిర్మల్ జిల్లాలో చిరుత సంచారం భయాందోళనకు గురిచేస్తోంది. పట్టణ శివారులోని బంగాల్పేట్ అటవీ ప్రాంతంలో చిరుత తిరుగుతున్నట్టు స్థానికులు చెబుతున్నారు. మంగళవారం రాత్రి బంగల్ పేట్ వినాయక సాగర్ చెరువు నుంచి విశ్వనాథ్ పేటకు వెళ్లే బైపాస్ రోడ్డులో చిరుత రోడ్డు దాటుతుండగా స్థానికులు గమనించారు. ఆ దారిలో వెళ్లే వారు చూసి సెల్‌ఫోన్‌లో చిరుత ఫొటోలనును బంధించారు. దీంతో ఆ ప్రాంతంలో రోజు ఉదయం వాకింగ్ కు వెళ్లేవారు ఈ విషయం తెలుసుకొని భయపడుతున్నారు. దీంతో నిర్మల్ పట్టణంలో భయాందోళన నెలకొంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement