వనపర్తి జిల్లాలో చిరుత సంచారం కలవరపెడుతుంది. చిరుత ఓ మేకపిల్లను ఎత్తుకెళ్లి చంపిన దృశ్యాలు వైరల్‌గా మారాయి. ఖిల్లా ఘణపురం అటవీ ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నట్లు స్థానికులు తెలిపారు.
గత నెల రోజులుగా ఒక ఆవు, ఒక దూడ, మేకలపై చిరుత దాడి చేసినట్లు పేర్కొన్నారు. అయితే చిరుత ఎక్కడ్నుంచి వస్తుందో తెలుసుకునేందుకు ఆ ఏరియాలో అక్కడక్కడ రెండు, మూడు సెల్‌ఫోన్లను అమర్చారు. అయితే గొర్రెల కాపరి జంగం రాములు.. ఎర్రకుంటలో అమర్చిన సెల్‌ఫోన్‌కు చిరుత దృశ్యాలు చిక్కాయి. చిరుత ఓ మేకపిల్లను ఎత్తుకెళ్లి చంపిన దృశ్యాలు ఆ ఫోన్లో రికార్డు అయ్యాయి. చిరుత సంచారంతో పశువుల, గొర్రెల కాపరులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. చిరుత సంచారంపై అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.