నాగర్కర్నూల్ జిల్లాలో చిరుత సంచారం కలవర పెడుతుంది. తూడుకుర్తి గ్రామంలో చిరుత సంచారంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గత సాయంత్రం తూడుకుర్తి, సర్కార్ పేట గ్రామ ప్రజలు పొలాలకు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో జింకలను తరుముతూ పులి కనిపించిందని ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు.
- Advertisement -
ఫారెస్ట్ అధికారులు అక్కడికి చేరుకొని గంగారం అటవీ ప్రాంతంలో సోలార్ బోర్ల వద్దకు జింకల గుంపులు ఎక్కువగా వస్తుంటాయని ఆ జింకల కోసం నాలుగు చిరుతపులు సంచరిస్తున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. తూడుకుర్తి పరిసర ప్రాంతాల్లోకి ఒంటరిగా వెళ్లకూడదని గ్రామస్తులకు చాటింపు వేయించి అప్రమత్తం చేశారు.