ప్రభన్యూస్ : రాష్ట్రంలో నకిలీ విత్తనాల బెడదను అరికట్టేందుకు అధునాతన బ్లాక్‌చైన్ సాంకేతికతను వాడుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ ఐటీ శాఖ, తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ సంస్థలు సంయుక్తంగా ట్రేస్ ఎక్స్ సొల్యూషన్స్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. బ్లాక్‌చైన్ సాంకేతికతను వాడడం ద్వారా ఈ సంస్థ తెలంగాణలోని ప్రతి విత్తనం ఎక్కడి నుంచి వచ్చిందనే విషయాన్ని తెలుసుకోవచ్చని, ఎన్‌ఎస్‌సీతో పాటు ప్రైవేటు కంపెనీల విత్తనాలన్నింటి వివరాలు కనుక్కోవచ్చని రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ పేర్కొన్నారు. ఈ ఒప్పందం కుదుర్చుకునే కార్యక్రమంలో తెలంగాణ ఎమర్జింగ్ టెక్నాలజీ వింగ్ డైరెక్టర్ రమాదేవి లంక, ట్రేస్ ఎక్స్ సొల్యూషన్స్ సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital