వరంగల్ : వ్యక్తిగత అప్రమత్తంగా వ్యవహరిస్తే చోరీలను నియంత్రించగలమని వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ ప్రజలకు పిలుపునిచ్చారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చోరీలను నియంత్రించడంతో ప్రజలు చోరీల బారిన పడకుండా తీసుకోవాల్సి జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తూ నగర శివారు ప్రాంతాల్లోని కాలనీ వాసులతో బుధవారం వరంగల్ పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీపీ రంగనాథ్ కాలనీ వాసులకు పలు సూచనలు చేస్తూ చోరీల నియంత్రణలు.. ప్రజలు సైతం భాగస్వాములు కావాలన్నారు. ఇందు కోసం పోలీసులు తెలిపే సూచనలను పాటించడం ద్వారా ఇండ్లల్లో జరిగే చోరీలను చెక్ పెట్టగలమని, ముఖ్యంగా వరంగల్, హనుమకొండ, కాజీపేట నగర శివారు ప్రాంతాల్లో చోరీ జరిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఈ చోరీల బారీన పడిన, పడకుండా కాలనీవాసులు ముందస్తూ జాగ్రత్త చెపట్టాల్సి అవసరం ఉందన్నారు. అవసరాల నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లే ముందుగా ఖరీదైన బంగారు ఆభరణాలు, డబ్బును ఇంటిలో భద్రపర్చకుండా బ్యాంక్ లాకర్ లో భద్రపర్చుకోవాలని, ఇంటితో పాటు కాలనీ పరిసరాల్లో సిసి కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఇతర ప్రాంతాలకు వెళ్లేముందుగా తప్పనిసరిగా ఇంటి చుట్టు ప్రక్కలవారికి తెలియజేయాలన్నారు. అలాగే పోలీసులకు సమాచారం అందించడం ద్వారా ఆయా ప్రాంతాల్లో పెట్రోలింగ్ నిర్వహించబడుతుందన్నారు. ముఖ్యంగా ఇంటి ప్రధాన తలుపులకు సెంట్రల్ లాకింగ్ సిస్టం ఏర్పాటు చేసుకోవడం అవసరమని ప్రయాణాలు చేసే సమయంలో ఇంటిలో పేపర్, పాల ప్యాకేట్లు వేయవద్దని వారికి సూచించాలి.. ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు ఇంటిలో ఒక వ్యక్తి ఉండే విధంగా జాగ్రత్తపడాలలన్నారు. తాళం కనబడకుండా ఇంటి ప్రధాన ద్వారంకు కర్టెన్లు వేయాలని, ఇంటిలో లైట్ వేసి ఉంచాలని, చోరీ కేవలం రాత్రుల్లో కాదు పగటి సమయాల్లోను జరుగుతాయని ప్రజలు గుర్తించాలన్నారు. ఏదైనా పనిమీద ఇంటి నుండి బయటకు వెళ్లినప్పుడు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పోలీస్ కమిషనర్ తెలియజేస్తారు. ఈ సమావేశంలో డీసీపీలు మురళీధర్, కరుణాకర్, అబ్దుల్ బారీ, ఏసీపీలు శ్రీనివాస్, తిరుమల్, డేవిడ్ రాజు ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, కార్పోరేటర్లు పాల్గొన్నారు.