ఛత్తీస్ గడ్ రాష్ట్రం దంతెవాడ జిల్లా బర్సూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత రాత్రి మావోయిస్టులు అమర్చిన బాంబు పేలుడు కారణంగా మూడు ఎలుగుబంట్లు మృతి చెందాయి. ఈ పేలుడు మావోయిస్టులు ఐఈడీ ను అమర్చడం ద్వారా జరిగింది. ఫారెస్ట్ అధికారులు ఈ విషయన్నీ ధృవీకరించారు. పేలుడు కారణంగా ఓ ఆడ ఎలుగుబంటి, దాని రెండు పిల్లలు అక్కడే మృతిచెందాయి.
మావోయిస్టులు ఈ బాంబులను జవాన్లను లక్ష్యంగా చేసుకుని అమర్చారు. అయితే వాటిపై నుంచి ఎలుగుబంట్ల వెళుతుండగా వత్తిడికి అవి పేలి అవి మరణించినట్లు పోలీసుల తెలిపారు. ఈ పేలుడు అనంతరం బాంబ్ స్వ్కాడ్ ఇక్కడ తనిఖీలు చేపట్టింది.. జవాన్లు ప్రయాణించే మార్గంలో ఉన్న మూడు బాంబులను తొలగించింది.. బాంబును తాకగానే అది పేలిపోయింది.