Tuesday, November 26, 2024

చిరుధాన్యాల సాగు పై శిక్షణ కార్యక్రమం

మండల పరిధిలోని మన్ననుర్ గ్రామాలో ఐసీఐసీఐ పౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం చిరుధాన్యాల సాగు పై ప‌దిరోజుల శిక్ష‌ణా కార్య‌క్ర‌మాన్ని సర్పంచ్ శ్రీరామ్ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ఐసీఐసీఐ పౌండేషన్ మన గ్రామంలో పనిచేయడం రైతులకు ఎంతో ఉపయోగకరమన్నారు. చిరు ధాన్యాలు పండించే రైతులకు ఐసిఐసిఐ పౌండేషన్ వారు ఉచితంగా విత్తనాలు పంపిణీ చేసి ఆ పంటకి కావాల్సిన సలహాలు సూచనలు అందించడం జరుగుతుందని అన్నారు .శిక్షణలో 36 మంది సన్న చిన్న కారు రైతులు పాల్గొన్నారు . శిక్షణకు రిసోర్స్ పర్సన్ గా మాడుగుల నరసింహ రైతులకు చిరుధాన్యాల సాగు పై శిక్షణ ఇచ్చారు. ఈ ఇందులో భాగంగా చిరుధాన్యాల కు ఇతర పంటలకు మధ్య వచ్చే ఆదాయం పైన అవగాహన కల్పించారు .ఈ కార్యక్రమంలో ఐసిఐసిఐ పౌండేషన్ కమ్యూనిటీ ఫెసిలిటేటర్ జి అంతయ్య ,ఉప సర్పంచ్ నారాయణమ్మ, రైతులు చంద్రు ,పర్వతాలు, నిరంజన్ ,శంకర్ ,హైమత్ ,షరీఫ్ ,కరీముల్లా తదితరులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement