Sunday, November 24, 2024

Changes – ధరణి పోర్టల్‌ అధ్యయనానికి ఐదుగురు సభ్యులతో కమిటీ…

హైదరాబాద్ – ధరణి పోర్టల్‌కు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనిపై అధ్యయనం , పునర్నిర్మాణం కోసం ఐదుగురు సభ్యులతో కమిటీని నియమించింది.

సీసీఎల్ఏ కన్వీనర్‌గా ఏర్పాటైన కమిటీలో ఏఐసీసీ కిసాన్ సెల్ ఉపాధ్యక్షుడు ఎం కోదండరెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రేమండ్ పీటర్, న్యాయవాది ఎం సునీల్, రిటైర్డ్ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ బి మధుసూదన్ వున్నారు. పరిస్ధితులు, అవసరాన్ని బట్టి కలెక్టర్లు, ఇతర రెవెన్యూ అధికారులను సభ్యులుగా చేర్చుకోవచ్చని ప్రభుత్వం జీవోలో తెలిపింది. సాధ్యమైనంత త్వరగా అధ్యయనం చేసి సిఫారసులు చేయాలని ప్రభుత్వం కమిటీని ఆదేశించింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ ఉత్తర్వులు జారీ చేశారు..

ధరణిలో లోటు పాట్లు సవరించడంతో పాటు అవసరమైతే కొత్త పోర్టల్ తీసుకొచ్చే అవకాశం వుంది. కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయం తీసుకోనుంది.

తెలంగాణ ఎన్నికల ప్రచారం ”ధరణి” పోర్టల్ చుట్టూ తిరిగిన సంగతి తెలిసిందే. తాము అధికారంలోకి వస్తే ధరణిని బంగాళాఖాతంలో విసిరేస్తామని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. దాని స్థానంలో భూమాత పోర్టల్ తెస్తామని హామీ ఇచ్చింది .

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement