చత్తీస్‌గఢ్‌లో మార్పు గాలివీస్తోందని, అధికారం తమదేనని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. చత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో రూ.7,600 కోట్ల ప్రాజెక్టుల్లో కొన్ని ప్రారంభించి, మరికొన్నింటికి శంకుస్థాపన చేసిన ప్రధాని.. తర్వాత నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ… తాను దేనికీ భయపడే వాడిని కాదన్నారు. చత్తీస్‌గఢ్‌లో అవినీతి ప్రభుత్వాన్ని బీజేపీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఆ రాష్ట్ర సీఎం భూపేశ్ బఘెల్ సమక్షంలోనే కాంగ్రెస్ లక్ష్యంగా మాటల దాడి చేశారు. భయపడే వాడు మోడీ కాదన్నారు.
కాంగ్రెస్ అడ్డుకునేందుకు ఎంత ప్రయత్నించినా.. చత్తీస్‌గఢ్ సంక్షేమం కోసం అడుగు ముందుకే వేస్తాను. వెనక్కి తగ్గేదే లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ పేదల శత్రువు అని ఆరోపించారు. ఛత్తీస్‌గఢ్ అభివృద్ధికి అడ్డుగోడలా ఓ పంజా (హస్తం) నిలిచిందని.. అది కాంగ్రెస్ పంజా అన్నారు. మీ హక్కులను లాగేసుకుంటోందని, మిమ్మల్ని దోచుకోవాలని, ఛత్తీస్‌గఢ్‌ను నాశనం చేయాలని నిర్ణయించుకుందని మోడీ విమర్శించారు.