మునుగోడు ఉప ఎన్నిక దగ్గర పడుతున్న కొద్దీ స్థానికంగా రాజకీయం వేడెక్కుతోంది. ఇంతకాలం పోటాపోటీగా చేరికలకు ప్రాధాన్యమిచ్చి లక్షల రూపాయల్లో ప్రలోభాలకు గురిచేసిన ప్రధాన పార్టీలు.. తాజాగా కీలక నేతలను అజ్ఞాతంలోకి వెళ్లేలా ఒత్తిడి చేస్తున్నాయి. చండూరు జడ్పీటీసీ సభ్యుడు కర్నాటి వెంకటేశం నిన్నటి (ఆదివారం) మధ్యాహ్నం నుంచి కనిపించడం లేదు. సోమవారం రాజగోపాల్‌రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో చండూరులో వెంకటేశం ప్రధాన భూమిక పోషించాల్సి ఉండగా.. నిన్న మధ్యాహ్నం నుంచి ఆయన సెల్‌ఫోన్ స్విచ్ ఆఫ్‌లో ఉంది.
గట్టుప్పల్‌కు మంత్రి కేటీఆర్ ఇన్‌చార్జిగా ఉండటంతో ఇక్కడ టీఆర్ఎస్కు పోలింగ్ శాతం ప్రతిష్ఠాత్మకంగా మారింది. దీంతో జడ్పీటీసీ సభ్యుడు కర్నాటి వెంకటేశంను కేటీఆర్ మనుషులు కిడ్నాప్ చేశారనే ప్రచారం జరుగుతోంది. అయితే వెంకటేశానికి సోమవారం మంత్రి జగదీశ్‌రెడ్డి మరోమారు గులాబీ కండువా కప్పుతారని టీఆర్‌ఎస్ నేతలు చెబుతున్నారు.