Friday, November 22, 2024

TS | కొత్తగా రెవెన్యూ డివిజన్‌గా చండూర్‌ .. మరో రెండు మండలాలు కూడా

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : నల్లగొండ జిల్లా ప్రజల సుధీర్గ డిమాండ్‌కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ జిల్లాలో చండూర్‌ రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు చేస్తూ ఫైనల్‌ నోటిఫికేషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. రెవెన్యూ ముఖ్య కార్యదర్కశి నవీన్‌ మిట్టల్‌ ఈ మేరకు జీవో జారీ చేశారు. అదేవిధంగా నల్లగొండ జిల్లా అమ్మనబోలులో మరో కొత్త మండలాన్ని ప్రతిపాదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రిలిమినరీ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ కొత్త మండలంలో అమ్మనబోలు, ఉప్పలంచ, సూరారం, బి తుర్కపల్లి, కుంకుడుపాముల గ్రామాలను చేర్చింది.

కాగా చండూర్‌ రెవెన్యూ డివిజన్‌లో నల్గొండ, దేవరకొండ రెవెన్యూ డివిజన్లనుంచి పలు మండలాలను తొలగించి ఈ కొత్త డివిజన్‌లో చేర్చింది. ఇందులో చండూర్‌, మునుగోడు, ఘట్టుప్పల్‌, నాంపల్లి, మర్రిగూడ మండలాలను చేర్చింది. కామారెడ్డి జిల్లాలో మహమ్మద్‌నగర్‌ నూతన మండలాన్ని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో ఇచ్చిన ప్రిలిమినరీ నోటిఫికేషన్‌ గడువు ముగియడంతో ఫైనల్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. 18 గ్రామాలతో ఈ మండలాన్ని ప్రతిపాదించి ప్రకటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement