నిన్న రాత్రి హైదరాబాద్ ని భారీ వర్షాలు ముంచెత్తాయి. ఈ క్రమంలో షేక్‌పేట్, నిజాంపేట్, గచ్చిబౌలి, కూకట్‌పల్లి, మియాపూర్, ఎస్‌ఆర్ నగర్, మాదాపూర్, జీడిమెట్ల, బంజారాహిల్స్, సికింద్రాబాద్, జూబ్లీహిల్స్, ఉప్పల్, తార్నాక, రాజేంద్రనగర్‌లో భారీగా వర్షం పడింది. షేక్‌పేటలో అత్యధికంగా 11.78 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.మాదాపూర్‌లో 10.9 సెంటీమీటర్లు, జూబ్లీహిల్స్‌లో 10.5 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. ముంపు ప్రాంతాల్లో జీహెచ్‌ఎంసీ రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. ఇలాగే మరో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. కాబట్టి లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
మరో రెండు రోజులు వర్షాలు కురిసే ఛాన్స్-లోతట్టు ప్రాంతాల ప్రజలకి హెచ్చరిక
Advertisement
తాజా వార్తలు
Advertisement